![]() |
![]() |
.webp)
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన 'లైలా' సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ వారం ఫామిలీ స్టార్స్ ఎపిసోడ్ కి ఈ లైలా టీమ్ మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చి గేమ్స్ కూడా ఆది ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఐతే ఇందులో యాంకర్ సుధీర్ అడిగిన ప్రశ్నలకు విశ్వక్ సేన్ ఆన్సర్స్ ఇచ్చాడు. "రియల్ లైఫ్ లో నా లైలా కోసం నేను ఇంకా వెతుకుతున్నా...ఐతే బాలకృష్ణ గారికి ముందుగా పద్మభూషణ్ వచ్చినందుకు కంగ్రాట్యులేషన్స్.
ఐతే ఆ తర్వాత లైలా మూవీ సెలెబ్రేషన్స్ లో అప్పుడే అందరం కాఫీ తాగాం. బాలకృష్ణగారు టక్కున ముద్దు పెట్టారు. ఐతే అదేం ఫస్ట్ ముద్దు కాదు. ఐతే ఇప్పటికైనా ఎప్పటికైనా నేను బ్రో అని బాలకృష్ణ గారిని పిలుస్తాను. ఐతే నాకు బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ కన్నా కూడా సీనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం వాళ్లకు కూడా సీనియర్ ఎన్టీఆర్ గారే ఇష్టం. నేను సినిమాల్లోకి రావడానికి చాలా ట్రై చేసాను. ఒకటే సినిమాకు ఏడెనిమిది సార్లు ఆడిషన్స్ ఇచ్చాను. ఆ తర్వాత అనిపించింది నాకు నిజంగా యాక్టింగ్ రాదేమో అనుకున్నా...ఆ తర్వాత రాంగ్ డైరెక్షన్ లో ఏమన్నా వెళ్తున్నామేమో అనుకున్నా. అదే టైంలో నన్ను ఒకతను పది నిమిషాలు చూసి నన్ను లీడ్ గా పెట్టి సినిమా తీసాడు అతనే తరుణ్ భాస్కర్. లైఫ్ లో నేను ఏ స్టేజి కి వెళ్లినా ఈ విషయాన్నీ అస్సలు మర్చిపోను. ఆ టైములో నన్ను వేలు పెట్టి చూపించి మరీ విశ్వక్ ని పెట్టుకుంటే ఐపోతావ్ అన్నారు.. ఈరోజు నా లైఫ్ బాగుంది అంటే ఒకటి తరుణ్ భాస్కర్ రెండోది ఫలక్నుమా దాస్ మూవీ" అని చెప్పాడు. ఐతే లైలా మూవీ మీద కొన్ని నెగటివ్ ట్రోల్స్ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. ఏదేమైనా మూవీని అందరూ థియేటర్ వచ్చి చూస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పాడు విశ్వక్
![]() |
![]() |